Home> ఏపీ
Advertisement

APSRTC Charges Hike: ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. కనీస టికెట్ ధర రూ.15..!

APSRTC Charges Hike: ఏపీఎస్ ఆర్టీసీ షాకింగ్ నిర్ణయం. డీజిల్ ధరల పెరుగుదలతో.. డీజిల్ సెస్​ పెంచింది ఆర్టీసీ. దీనితో పల్లె వెలుగు బస్సుల్లో కనీస టికెట్ ఛార్జీ రూ.15కు పెరగనుంది. రేపటి నుంచే ఈ కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

APSRTC Charges Hike: ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. కనీస టికెట్ ధర రూ.15..!

APSRTC Charges Hike: ఏపీ ప్రజలకు బ్యాండ్ న్యూస్​..! ఇప్పటికే పెరిగిన నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. డీజిల్ సెస్ పెంచాలని ఆర్​టీసీ నిర్ణయించింది దీనితో.. టికెట్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.

ఛార్జీల పెంపు అందుకే..

దేశంలో గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సుల నిర్వహణ వ్యయం పెరిగనట్లు ఆర్టీసీ ఎండీ ద్వరకా తిరుమల వెల్లడించారు. దీనితో ఛార్జీలు పెంచక తప్పడం లేదన్నారు. గత రెండేళ్లలో ఆర్టీసీ రూ.5,680 కోట్ల ఆదాయం కోల్పోయిందని చెప్పారు. ఇదే సమయంలో డీజిల్ ధర 60 శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఫలితంగా భరించలేని స్థితికి ఆర్టీసీ చేరిందని పేర్కొన్నారు. అందుకే ఛార్జీల పెంపునకు సిద్ధమైనట్లు చెప్పుకొచ్చారు.

క్రితంతో పోలిస్తే.. తాజాగా పల్లె వెలుగు బస్సులకు రూ.2, ఎక్స్​ప్రెస్​ బస్సుల ఛార్జీలు రూ.5, ఏసీ బస్సుల ఛార్జీలు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు వివరించారు. ఇక ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి (ఏప్రిల్ 14) అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. అయితే ఇది టికెట్ ఛార్జీల రివజిన్ కాదని.. డీజిల్ సెస్ పెంపు అని తెలిపారు.

కొత్త ఛార్జీలు రేపటి నుంచే..

ఇక రేపటి నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కనీస బస్ ఛార్జీ రూ.10గా ఉంటే.. డీజిల్ సెస్సు రూ.2, సెఫ్టీ సెస్ కింద రూ.1 వర్తిస్తుందని వివరించారు. అయితే రూ.13గా ధర ఉంటే చిల్లర సమస్య వస్తుందని అందుకే.. రౌండ్ ఆఫ్​గా టికెట్ ధరను రూ.15గా నిర్ణయించినట్లు చెప్పారు ద్వారకా తిరుమల. తాజా నిర్ణయంతో ఆర్టీసీ ప్రయాణికులపై ఏటా రూ.740 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేశారు.

అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఉన్న సంక్షోభంలో 32 శాతం మేర ఛార్జీలు పెంచితేనే.. నష్టాల నుంచి గట్టెక్కే అవకాశముందన్నారు ద్వారకా తిరుమల అయితే అలా చేస్తే ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇక ఆర్టీసీ తీసకున్న తాజా నిర్ణయంతో బస్​ పాసుల రేట్లు కూడా పెరగనున్నాయి.

ఇటీవలే కరెంటు బిల్లులు కూడా పెంచింది ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం. ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలోనే మరోసారి సామాన్యులపై భారం పడేలా ఈ ప్రకటన రావడం గమనార్హం.

Also read: AP Health Minister: తెలంగాణ బిడ్డ..పొరుగు రాష్ట్రంలో మంత్రిగా..గ్రామస్థుల ఆనందం

Also read: Stampede in Tirumala: తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు.. తొక్కిసలాటలో భక్తులకు గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More