Home> ఏపీ
Advertisement

Janata Curfew: జనతా కర్ఫ్యూ.. ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు

ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నామని మంత్రి స్పష్టంచేశారు. 

Janata Curfew: జనతా కర్ఫ్యూ.. ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు

విజయవాడ: కరోనా వైరస్‌ను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపడుతున్న జనతా కర్ఫ్యూకు (Janata curfew) ఏపీ సర్కార్ (AP govt) సైతం తమదైన రీతిలో మద్దతు పలికింది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టుగా ఏపీ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) ప్రకటించారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నాం. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ (Private travels) ఆపరేటర్లను కూడా జనతా కర్ఫ్యూకు మద్దతుగా బస్సు సేవలను రద్దు చేయాల్సిందిగా కోరామని మంత్రి పేర్ని స్పష్టంచేశారు. 

Read also : Coronavirus: రైళ్లలో ప్రయాణించిన వారికి కరోనావైరస్.. ప్రయాణికులకు రైల్వే సూచన

జనతా కర్ఫ్యూ ముగిసిన అనంతరం రాత్రి నుండి తిరిగి సర్వీసులన్నింటినీ పునరుద్దిరిస్తాం. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం తీసుకుంటున్న నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన స్వచ్చంద జనతా కర్ఫ్యూ పిలుపు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రయాణీకులు ఆర్టీసి సిబ్బందికి సహకరించాల్సిందిగా మంత్రి ప్రయాణికులకు విజ్ఞప్తిచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More