Home> ఏపీ
Advertisement

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. ప్రైవేటు జాబ్స్ కోసం అతి పెద్ద ఉద్యోగ మేళా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏపీ ఐటీ అకాడమీ అతి పెద్ద ఉద్యోగ మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. ప్రైవేటు జాబ్స్ కోసం అతి పెద్ద ఉద్యోగ మేళా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏపీ ఐటీ అకాడమీ అతి పెద్ద ఉద్యోగ మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. మే 15వ తేది నుండి 29వ తేది వరకు ఈ మేళాను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, ఈకామర్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన సంస్థలు ఈ మేళాలో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.

దాదాపు 10 వేల ఉద్యోగాలను ఈ ఉద్యోగ మేళా ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని ఏపీ ఐటీ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ ఉద్యోగ మేళా గురించి మరింత సమాచారం కోసం 7901389204 లేదా 0866 2841800 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనాలని భావిస్తే.. www.apita.ap.gov.in వెబ్ సైట్ కూడా సందర్శించవచ్చు.  ఏపీ ఐటీ అకాడమీ ఇప్పటికే "అమరావతి నాలెడ్జి సెంటర్" పేరుతో విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొనేందుకు తగిన శిక్షణను అందిస్తోంది. 

Read More