Home> ఏపీ
Advertisement

Inner Case: లోకేశ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, ఇన్నర్ కేసులో ఏ14గా నారా లోకేశ్

Inner Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు చంద్రబాబు అతని కుమారుడు లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను ఏ14గా చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

Inner Case: లోకేశ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, ఇన్నర్ కేసులో ఏ14గా నారా లోకేశ్

Inner Case: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి నారా లోకేశ్‌ను కూడా ఆరెస్టు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్టే నారా లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్ పేరు చేర్చుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. లోకేశ్ ప్రమేయముందనే ఆరోపణలు చేర్చింది సీఐడీ.

ఏపీ స్కిల్ కేసు తరువాత ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు ఉంటే ఇప్పుడు ఏ14గా నారా లోకేశ్ పేరును చేర్చింది సీఐడీ. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత ఆస్థుల విలువల్ని పెంచుకునేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారనేది సీఐడీ ఆరోపణ. సింగపూర్ కన్సల్టెన్సీకు మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించి అందులో నిబంధనలకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియోగం మోపింది. ఈ కేసులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రముఖ వ్యక్తులు తమ భూముల విలువ పెంచుకునేందుకు అలైన్‌మెంట్ మార్పులు చేసుకున్నారని ఆరోపించింది.

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. ఈ కేసులో లింగమనేని ఏ3గా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ తుది అలైన్‌మెంట్‌కు ఆనుకుని లింగమనేని కుటుంబానికి 168.45 ఎకరాలున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో క్విడ్ ప్రోకోలో భాగంగా కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు అప్పగించారనేది సీఐడీ వాదన.

ఇప్పుడీ కేసులో ఏ1గా తండ్రి చంద్రబాబు ఉంటే..ఏ14గా లోకేశ్ పేరును చేర్చింది సీఐడీ. ఈ క్రమంలో లోకేశ్‌ను సైతం త్వరలో అరెస్టు చేస్తారనే వాదనలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఒకదాని వెంట మరొక కేసులతో చంద్రబాబు, లోకేశ్‌లను ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలనేది జగన్ వ్యూహమని కొందరు విశ్లేషిస్తున్నారు. 

Also read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారించనున్న సుప్రీంకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More