Home> ఏపీ
Advertisement

IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలు

IMD Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న వారం రోజులు భారీ వర్షసూచన జారీ అయింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలు

IMD Rains Alert: ఏపీకు ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో రానున్న 4-5 రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రానున్న మూడ్రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం

రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలోని అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక జూన్ 25 మంగళవారం నాడు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షసూచన ఉంది. అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కాకినాడ,  కోనసీమ, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

ఇక జూన్ 26వ తేదీ బుధవారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. సత్యసాయి, కడప, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. జూన్ 27 గురువారం నాడు కాకినాడ, ప్రకాశం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే  అవకాశాలున్నాయి. దాంతో ఆరుబయట, పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. చెట్ల కింద, టవర్స్ కింద ఉండవద్దని సూచించింది.

Also read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More