Home> ఏపీ
Advertisement

AP Weather Alert: ఠారెత్తే ఎండల్నించి ఉపశమనం, రెండ్రోజులు వర్ష సూచన

AP Weather Alert: ఎండాకాలం ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది.
 

AP Weather Alert: ఠారెత్తే ఎండల్నించి ఉపశమనం, రెండ్రోజులు వర్ష సూచన

AP Weather Alert: తెలుగురాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోయింది. రోజుూ 40 డిగ్రీలు దాటి గరిష్టంగా 44 డిగ్రీల వరకూ నమోదవుతోంది. ఠారెత్తుతున్న ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కూల్‌న్యూస్ అందించింది. 

మరో రెండ్రోజుల తరువాత అంటే ఏప్రిల్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులు ఉండవచ్చని అంచనా. మోస్తరు వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు నమోదు కావచ్చు. అంటే భారీ వర్షాలు కాకపోయినా ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం లభించనుందని తెలుస్తోంది.

ఏపీ మీదుగా దిగువ ట్రోపోస్పోరిక్ ఆగ్నేయ-నైరుతి గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. మరోవైపు రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలోని కొన్న ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలులు వీయవచ్చని సమాచారం. ఇవాళ బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతూరులో గరిష్టంగా 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అటు పక్కనున్న నెల్లిపాకలో కూడా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానుంది.

Also read: Ys Jagan Coments: సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం, మే 3వ తేదీన అదానీ డేటా సెంటర్ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More