Home> ఏపీ
Advertisement

Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

Kodali nani: వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాని నానికి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఏపీలో మాజీ వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకొవాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు,అనేక మంది నాయకులను వరుసగా భేటీ అవుతున్నారు.

Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

Ap Volunteer filed police complaint against kodali nani:  వైఎస్సార్పీపీ మాజీ మంత్రి కోడాలి నాని బిగ్ షాక్ గా చెప్పుకొవచ్చు. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోయింది.  ఈ నేపథ్యంలో గతంలో అధికారంలో ఉండగా.. ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అప్పట్లో వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిని రాజీనామాలు చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా అనే జిల్లాలలో వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి, ఏపీ సచివాలయం ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలలో అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా..వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

సీఎంగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టారు. కూటమి పార్టీలకు చంద్రబాబు శాఖల కేటాయింపుల్లో అన్నిరకాలుగా సముచిత స్థానం కల్పించారని చెప్పుకొవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏపీలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలను వరుసగా కలుస్తున్నారు. ఇటీవల చంద్రబాబును కూడా కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడిని .. వాలంటీర్లు కలిసినప్పుడు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత నాయకులు, స్థానిక లీడర్లు తమతో బలవంతంగా  రాజీనామాలు చేయించారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతు.. మీతో రాజీనామాలు చేయించిన వారిపైన స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సలహ ఇచ్చారు. ఆ తర్వాత తమను కలవాలని చెప్పారు. దీంతో ఏపీలో రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా వరుసకట్టిమరీ తమతో రాజీనామాలు చేయించిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో తాజాగా, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కోడాలి నానిపై  వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమతో కోడాలి నాని, ఆయన అనుచరులు.. గొర్లశ్రీను, దుక్కిపాటి శశిభూషణ్, మరి కొందరు నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు ఒత్తిడి పెట్టడం వల్ల రాజీనామాలు చేయాల్సి వచ్చిందని, తమ కుటుంబాలన్ని రోడ్డున పడ్డాయని వాలంటీర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుని, ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా వాలంటీర్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలే.. ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ ఓడిపోయి  పీకల్లోతు కష్టాల్లో ఉంది. మరోవైపు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదులు చేయడం వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More