Home> ఏపీ
Advertisement

AP TET: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రైవేట్ టీచర్లకూ టెట్ తప్పనిసరి...

AP TET 2022: ఇకపై ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
 

AP TET: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రైవేట్ టీచర్లకూ టెట్ తప్పనిసరి...

AP TET 2022: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు కూడా టెట్ (TET)అర్హత తప్పనిసరి చేసింది. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు టెట్ అర్హత సాధించాల్సిందేనన్న నిబంధన పెట్టింది. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల విద్యాశాఖ అధికారులకు మెమో జారీ చేశారు.

ఆగస్టులో టెట్ పరీక్షలు :

కొద్దిరోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి జూలై 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అభ్యర్థులు aptet.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు సమర్పించాక ఎలాంటి మార్పులు చేయరాదు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు నింపేటప్పుడు జాగ్రత్తగా సరిచూసుకోవాలి. 

జూలై 25 నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తారు. ఆగస్టు 6  నుంచి ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే.. విద్యాశాఖ హెల్ప్ డెస్క్‌లో సంప్రదించవచ్చు. టెట్‌లో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. టెట్‌లో సాధించే స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఒకసారి టెట్ అర్హత సాధిస్తే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. స్కోర్ పెంపునకు తప్ప మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం లేదు. 

Also Read: TNPL Mankading: ఔట్ అయిన అసహనంలో.. మిడిల్ ఫింగర్ చూపించిన భారత బ్యాటర్! మండిపడుతున్న ఫ్యాన్స్‌  

 

Also Read: Naresh - Pavitra Lokesh :పెళ్లి వార్తల నేపథ్యంలో భర్త అలాంటి వాడంటున్న పవిత్ర లోకేష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More