Home> ఏపీ
Advertisement

Amalapuram Violence: వైఎస్సార్ మతకలహాలు స్పష్టిస్తే.. జగన్ కులాల చిచ్చు రేపారు!

Amalapuram Violence: అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్న అధికార వైసీపీ నేతల ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నాకు. అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ సహాయ, సహాకారాలతో పథకం ప్రకారం జరిగిందేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు

 Amalapuram Violence: వైఎస్సార్ మతకలహాలు స్పష్టిస్తే.. జగన్ కులాల చిచ్చు రేపారు!

Amalapuram Violence: అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్న అధికార వైసీపీ నేతల ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నాకు. అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వ సహాయ, సహాకారాలతో పథకం ప్రకారం జరిగిందేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.విధ్వంసం చేయించిన వారంతా వైసీపీ ముఖ్య కార్యకర్తలే అన్నారు. కోనసీమ సాదన సమితి ఉద్యమంలో కీలకంగా ఉన్న అన్నంసతీశ్ ఏ పార్టీవాడని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అతను టీడీపీ వాడయితే సజ్జల రామకృష్ణారెడ్డిని కౌగిలించుకొని, మంత్రి విశ్వరూప్ కు సన్మానంచేస్తాడా? అని నిలదీశారు.

 విధ్వంసాలు, వినాశనాలు వైఎస్సార్ కుటుంబానికి పుట్టుకతోనే వచ్చిన విద్య అన్నారు అచ్చెన్నాయుడు.  ముఖ్యమంత్రి పదవికోసం రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించి, 200మంది చావుకు కారకులయ్యారని ఆరోపించారు. తండ్రి చనిపోయాక ముఖ్యమంత్రి పదవికోసం రిలయన్స్ సంస్థలపై జగన్ రెడ్డి దాడులు చేయించలేదా? అని ప్రశ్నించారు.కాపు ఉద్యమం ముసుగులో తునిలో రైలుతగలబెట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా? అని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంతబాబాయ్ ని చంపించింది ఈ వ్యక్తికాదా? అంటూ జగన్ ను టార్గెట్ చేశారు ఏపీ టీడీపీ చీఫ్.  ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకటి సృష్టించడం జగన్ కు బాగాతెలుసన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనమైందన్నారు. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కోనసీమలో జగన్ చిచ్చుపెట్టించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

చంద్రబాబుకి ప్రజాదరణ పెరగడం, టీడీపీ మహానాడు జరుగుతుండటంతో అమలాపురంలో విధ్వంసానికి కుట్రలేపారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ రెడ్డి దిట్టని అన్నారు. అందరికీ తెలుసు. కోనసీమలో ఉద్యమం జరుగుతుందని తెలిసీ కూడా ప్రభుత్వం  ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కనీసం పూర్తిస్థాయి సీఐని కూడా నియమించకపోవడానికి కారణమేంటని నిలదీశారు.144సెక్షన్ విధించినా అమలాపురంలోకి  ఒకేసారి అంతమంది ఎలా వచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. లా అండ్ ఆర్డర్ లో జగన్ ప్రభుత్వం విఫలమైంది అనడానికి మంత్రి ఇల్లు తగలబడటమే నిదర్శనమన్నారు అచ్చెన్నాయుడు. ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కోనసీమ అల్లర్లపై జగన్ నుంచి కనీసస్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యచిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి ఆటలు సాగనివ్వమని అచ్చెన్నాయుజు హెచ్చరించారు. 

READ ALSO: Amalapuram Update: పీకే డైరెక్షన్ లోనే కోనసీమలో అల్లర్లు.. జనసేన నేతలు సంచలన కామెంట్లు..

READ ALSO: Kapil Sibal: కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్..పార్టీకి సీనియర్ నేత గుడ్‌బై..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More