Home> ఏపీ
Advertisement

AP: కరోనా కట్టడి చర్యల్లో ఏపీదే అగ్రస్థానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి చర్యల్లో అగ్రభాగంగా నిలుస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా..ఇప్పుడు రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడింది.

AP: కరోనా కట్టడి చర్యల్లో ఏపీదే అగ్రస్థానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra pradesh ) కరోనా వైరస్ కట్టడి చర్యల్లో అగ్రభాగంగా నిలుస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా..ఇప్పుడు రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడింది.

ఏపీలో ఓ వైపు కరోనా వైరస్ కేసులు ( Coronavirus cases in ap ) గణనీయంగా పెరుగుతున్నా...కట్టడికి తీసుకుంటున్న చర్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కరోనా నియంత్రణలో ఏపీ మంచి పురోగతి సాధించిందని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ప్రశంసించింది. తాజాగా విడుదల గణాంకాలు కూడా ఇదే చెబుతున్నాయి. Also read: Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

జాతీయ స్థాయిలో రికవరీ రేటు ( Recovery rate ) 77.30 కాగా..ఏపీలో 79.10 శాతం

మరణాల రేటు ( Death rate ) జాతీయ స్థాయిలో 1.72 కాగా..ఏపీలో 0.89 శాతం

దేశంలో ప్రతి మిలియన్ కు 35 వేల 206 పరీక్షలు చేస్తుంటే..ఏపీలో 76 వేల 927 మందికి పరీక్షలు

రాష్ట్రలో గత 24 గంటల్లో అత్యధికంగా  72 వేల 573 కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests in ap ) నిర్వహించి రికార్డు సృష్టించింది ఏపీ ప్రభుత్వం. పది కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఇన్ని పరీక్షలు ఒకేసారి చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 41 లక్షల 7 వేల 890 కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 10 వేల 794 పాజిటివ్ కేసులు నమోదు కాగా...70 మంది మరణించారు. కాగా 11 వేల 915 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇప్పటివరకూ 4 లక్షల 98 వేల 125 కాగా...3 లక్షల 94 వేల 19 మంది కోలుకున్నారు. ఇంకా యాక్టివ్ కేసులు ఏపీలో 99 వేల 689 ఉన్నాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా 4 వేల 417 మంది మృతి చెందారు.

ఇక ప్రతి పది లక్షల మంది జనాభాకు 76 వేల 927 పరీక్షలు రాష్ట్రంలో చేస్తూ అగ్రస్థానంలో ఉండగా...అదే పది లక్షల జనాభాకు 70 వేల 608 పరీక్షలతో అస్సోం రెండో స్థానంలో ఉంది. ఓవరాల్ గా అన్ని అంశాల్లోనూ ఏపీ టాప్ లో నిలవడం విశేషం. Also read: Pendem Dorababu: బెంగుళూరుకు స్పెషల్ హెలికాప్టర్ లో పిఠాపురం ఎమ్మెల్యే

 

Read More