Home> ఏపీ
Advertisement

AP Municipal Elections: ఏపీలో మరోసారి మినీ మున్సిపల్ సంగ్రామం, నవంబర్‌లో ఎన్నికలకు కసరత్తు

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకోనుంది. నవంబర్ నెలలో మినీ మున్సిపల్ సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 

AP Municipal Elections: ఏపీలో మరోసారి మినీ మున్సిపల్ సంగ్రామం, నవంబర్‌లో ఎన్నికలకు కసరత్తు

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకోనుంది. నవంబర్ నెలలో మినీ మున్సిపల్ సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 

ఏపీలో మరోసారి ఎన్నికల శంఖారావం మోగనుంది. చిన్నస్థాయి మున్సిపల్ సంగ్రామం(Municipal Elections) జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్ని నవంబర్ నెల 7,8 తేదీల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చ్ 2021లో వివిధ కారణాలతో రాష్టంలో 4 కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటీలు , నగర పంచాయితీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇందులో నెల్లూరు కార్పొరేషన్(Nellore Corporation) సహా 12 మున్సిపాలిటీలైన చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, కర్నూలు జిల్లా బేతంచెర్ల, కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, అనంతపురంలో పెనుకొండ ఉన్నాయి.

మరో రెండ్రోజుల్లో ఈ స్థానాల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ (Election Notification)జారీ అయ్యే అవకాశముంది. నోటిఫికేషన్ మరుసటి రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టి..నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం(AP SEC). అదే సమయంలో వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిలిచిపోయిన 12 డివిజన్లు, 14 వార్డుల ఎన్నికల కూడా జరగనున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. అన్నింటికీ కలిపి ఒకే రోజు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. మునిసిపల్‌ ఎన్నికలకు ఒకరోజు ముందుగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, ఆ తర్వాత రోజు మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించి..ఆ మరుసటి రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని(Neelam Sahni) ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Also read: Pawan Kalyan: ఆ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టండి: పవన్ డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More