Home> ఏపీ
Advertisement

AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, ఈ నెల 15 నుంచి కేవలం నైట్ కర్ఫ్యూ

AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.5 శాతం కేసులే నమోదవుతున్నాయి.
 

AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, ఈ నెల 15 నుంచి కేవలం నైట్ కర్ఫ్యూ

AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.5 శాతం కేసులే నమోదవుతున్నాయి.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రభావం గణనీయంగా తగ్గింది. గత కొద్దిరోజుల్నించి కరోనా కేసుల సంఖ్య భారీ ఎత్తున తగ్గుతోంది. గత 24 గంటల్లో 81 వేల 763 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేయగా..కేవలం 2 వేల 567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 19 లక్షల 26 వేల 988 పాజిటివ్ కేసులు నమోదు కాగా..ప్రస్తుతం 26 వేల 710 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 3 వేల 34 మంది కోవిడ్ నుంచి కోలుకోగా..ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 87 వేల 236 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 18 మంది కరోనా కారణంగా మరణించగా..రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 42 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 356, చిత్తూరులో 300, పశ్చిమ గోదావరి జిల్లాలో 279, ప్రకాశం జిల్లాలో 351 కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రమంతటా ఒకే విధంగా కర్ఫ్యూ వేళల్లో మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రంలో ఇక నుంచి కేవలం నైట్ కర్ఫ్యూ(Night Curfew) మాత్రమే అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల్నించి రాత్రి 9 గంటల వరకూ దుకాణాలు తెర్చుకోవచ్చు. ఈ నెల 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి. 

Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్, నేటి నుంచి కేవలం నైట్ కర్ఫ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More