Home> ఏపీ
Advertisement

Nimmagadda Ramesh Kumar: Voter ID కోసం ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తంటాలు!

AP SEC Nimmagadda Ramesh Kumar Voter Application Rejected: ఏపీలో పంచాయతీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఓటర్ ఐడీ దరఖాస్తును గతంలో అధికారులు తిరస్కరించారు.

Nimmagadda Ramesh Kumar: Voter ID కోసం ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తంటాలు!

AP SEC Nimmagadda Ramesh Kumar Voter Application Rejected: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కుపై వివాదం కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలోని స్వస్థలమైన దుగ్గిరాలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఓటు హక్కును తొలగించారు. దీనిపై గుంటూరు జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు.

ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం గుంటూరు జిల్లా దుగ్గిరాలో ఉన్న తన పూర్వీకుల ఇంటికి వెళ్లారు. పంచాయతీ ఎన్నికల(AP Panchayat Elections 2021 Latest Update) నేపథ్యంలో తాను తిరిగి ఓటు హక్కు పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఓటును తిరిగి పొందేందుకు  అధికారుల సందేహాలను తొలగించనున్నట్లు చెప్పారు. రమేష్ కుమార్ ఇటీవల దుగ్గిరాలలో ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దరఖాస్తు తిరస్కరించారు.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి Gold Rates, స్థిరంగా Silver Price

ఓటర్ నివసించే స్థలం ఆధారంగా వ్యక్తికి ఓటరు ఐడీ జారీ చేస్తారు. నిమ్మగడ్డ శాశ్వత చిరునామా(Nimmagadda Ramesh Kumar Permanent Address) హైదరాబాద్‌లో ఉన్నందున, దుగ్గిరాల అధికారులు ఆయన ఓటరుగా నమోదు దరఖాస్తును తిరస్కరించారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రస్తుతం విజయవాడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, పని రోజులలో మాత్రమే అక్కడ నివసిస్తున్నారని తెలిసిందే. 

Also Read: Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitaram

గుంటూరు జిల్లా కలెక్టర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని తాను ఎన్నడూ నివాసం ఉండని దుగ్గరాలలో తనకు ఓటు హక్కు హక్కును కల్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్వయంగా నిమ్మగడ్డనే విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అంగీకరించారు. దాంతో పాటుగా ఆయన పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్‌లో ఉన్న కారణంగా ఓటరు కార్డు జారీ చేయలేదు.

ఆయన ఓటు హక్కు దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దుగ్గిరాల నుండి తనకు ఓటరు ఐడీ కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని గుంటూరు జిల్లా అధికారులు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తెలియజేశారు.

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 1, 2021 Rasi Phalalu 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More