Home> ఏపీ
Advertisement

AP Rains: మళ్లీ భయం గుప్పిట్లో బుడమేరు.. విజయవాడకు రెడ్ అలర్ట్..

AP Rains: ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఏపీలో ముఖ్యంగా విజయవాడ బుడమేరు పరివాహాక ప్రాంతాలు ముంపుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బుడమేరు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు.

AP Rains: మళ్లీ భయం గుప్పిట్లో బుడమేరు.. విజయవాడకు రెడ్ అలర్ట్..

Vijayawada Red Alert: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షం వీడటం లేదు.  ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వర్షాలకు మునిగిపోయాయి. ముఖ్యంగా బుడమేరు వాగు పొంగడంలో సగం విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఇపుడిపుడే వరద తగ్గుముఖం పట్టి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న ఈ దశలో ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వార్తలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బుడమేరు పరివాహాక ప్రాంతాలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు.  

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వెలగలేరు రెగ్యులేటర్‌ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటిమట్టం ఉందని అంటున్నారు. అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నీటిమట్టం ఒక అడుగు పెరిగిందని తెలిపారు. గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. లోతట్టున ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్‌సింగ్‌ నగర్, గుణదల, రామవరప్పాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే వరదల కారణంగా సర్వం కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డారు. కట్టు బట్టలు తప్ప ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వరద పాలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనికి రాకుండా పోయాయి. మరోవైపు ద్వి చక్రవాహనాలు, ఫోర్ వీలర్స్ అన్ని వరద నీటికి పాడైపోయాయి. మొత్తంగా చెప్పాలంటే బుడమేరు వరదల కారణంగా ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అంతేకాదు వరదల కారణంగా విలువైన పత్రాలు.. సర్టిఫికేట్స్ అన్ని నీళ్ల పాలయ్యాయ.  

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More