Home> ఏపీ
Advertisement

Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం మాటల్లా ఉన్నాయి

Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు  బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్టుందన్నాడట వెనకటికి ఎవరో. ఇప్పుడిదే మాటల్ని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పారు. అది కూడా ఇవాళ పదవీ విరమణ చేసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురించి..
 

Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం మాటల్లా ఉన్నాయి

Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు  బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్టుందన్నాడట వెనకటికి ఎవరో. ఇప్పుడిదే మాటల్ని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పారు. అది కూడా ఇవాళ పదవీ విరమణ చేసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురించి..

ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh kumar) వైఖరిపై మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. నిమ్మగడ్డ ఉద్యోగం  చివరిరోజున  శ్రీరంగనీతులు చెబుతుంటే.. పచ్చి తిరుగుబోతు వచ్చి బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్లుందని విమర్శించారు. ప్రస్తుతం నిమ్మగడ్డ లేఖను చూస్తే..చెబుతున్న మాటలకు చేసే చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదని విమర్శించారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ దూరంగా ఉండాలని చెప్పి..హోటల్‌లో సుజనా చౌదరిని కలిసి వస్తాడని అన్నారు. కేసులు లేనప్పుడు ఎన్నికలు ఆపి,,కేసులు పెరిగాయ ఎన్నికలు నిర్వహించాలనేరకమని మండిపడ్డారు. 

వ్యాక్సినేషన్ (Vaccination) వేస్తుంటే ఎన్నికలు జరపను అని చెప్పి..చంద్రబాబు ఎన్నికలు జరపమంటే జరిపాడని మంత్రి పేర్ని నాని (Minister Perni nani) దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రజలు అమాయకులనేది చంద్రబాబు, నిమ్మగడ్డ అభిప్రాయమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయములో లేఖ రాయించుకుని కేంద్రానికి లేఖ పంపిన ఈయన నీతులు చెబుతుంటే వినాలా అని ప్రశ్నించారు. కాపురం హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో ఓటు కావాలంటున్నాడని..కనీసం ఆ అడ్రస్‌లో ఉంటున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలి కదా అని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ కోర్టుకు వెళ్లినా ఓటు ఎలా వస్తుందని నిలదీశారు. 2016 ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు తీసుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్..అప్పటివరకూ ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు ఎందుకు జరపలేదో చెప్పాలని కోరారు.   

Also read: Ap Sec Nimmagadda Ramesh kumar: ప్రభుత్వ సహకారంతో సాధ్యమైందంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More