Home> ఏపీ
Advertisement

AP Capital Issue: దసరా నాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభం కానుందా, ప్రభుత్వం స్పష్టం చేసేసిందా

AP Capital Issue: విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దసరా నాటికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AP Capital Issue: దసరా నాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభం కానుందా, ప్రభుత్వం స్పష్టం చేసేసిందా

AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు విశాఖ ప్రాధాన్యతను చెబుతున్నాయి. మరోవైపు దసరా నాటికి పాలన ప్రారంభం కావచ్చని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ ప్రత్యేక దృష్టి సారించింది. భారీ ప్రాజెక్టులన్నీ విశాఖకు వస్తుండటంతో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  నిర్వహణ ఇలా ప్రతి ఒక్కటీ ఏపీ ప్రభుత్వానికి విశాఖపట్నంపై ఉన్న ప్రత్యేక ప్రాధాన్యతను తెలియపరుస్తోంది. ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. త్వరలో విశాఖపట్నం ప్రజల కల నెరవేరనుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. దసరా నాటికి విశాఖ ప్రజల కోరిక నెరవేరనుందంటూ సంచలన విషయం వెలిబుచ్చారు. పార్టీ నాయకత్వం కోరుకున్న పరిణామం త్వరలో నెరవేరనుందని గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. దసరా పండుగకు విశాఖ ప్రాంతానికి బ్రహ్మాండమైన కానుక రానుందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గుర్తు చేశారు. 

Also read: Telangana Alert: తెలంగాణకు మళ్లీ వర్షం ముప్పు, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Read More