Home> ఏపీ
Advertisement

Janasena: పవన్ కల్యాణ్‌పై మంత్రి అనిల్ సెటైర్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ఎద్దేవా చేస్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి మూడు రాజధానులు వివాదంపై మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu), జనసేనాని పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

Janasena: పవన్ కల్యాణ్‌పై మంత్రి అనిల్ సెటైర్స్

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ఎద్దేవా చేస్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి మూడు రాజధానులు వివాదంపై మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu), జనసేనాని పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధిపర్చాలనే లక్ష్యంతో పరిపాలన వికేంద్రీకరణ కోసం మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తోంటే.. వీళ్లు మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని అమరావతి నుంచి మార్చడం లేదని.. ఉన్నదానికి తోడుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ ( Minister Anil Kumar Yadav ) స్పష్టంచేశారు. మరో రెండు రాజధానులు ఏర్పాటు చేసిన తర్వాత కూడా అమరావతికి ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గదని ఆయన తేల్చిచెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి అనిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: Janasena: జనసేన పనికిమాలిన సేన.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని పవన్ కల్యాణ్‌ వ్యతిరేకిస్తుండటంపై మంత్రి అనిల్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్‌లోనే ఉంటార‌ని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏమో ఎవరికీ అర్థం కాదని అసహనం వ్యక్తంచేశారు. అసలు పవన్‌ కల్యాణ్ గురించి మాట్లాడటమే అనవసరం. ఆయన ఒకసారి బీజేపీ అంటారు... ఇంకోసారి టీడీపీ అంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. పవన్ మాత్రం చంద్రబాబు నాయుడుకే మద్దతు పలుకుతున్నారు. అందుకే ఆయన గురించి చర్చ అనవసరం అంటూ కొట్టిపారేశారు. Also read: Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక

Read More