Home> ఏపీ
Advertisement

Eluru Corporation Result: ఏలూరు కార్పొరేషన్ ఫలితాలపై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

Eluru Corporation Result: ఏపీలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఏలూరు ఫలితాలకు సంబంధించి  రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.

Eluru Corporation Result: ఏలూరు కార్పొరేషన్ ఫలితాలపై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

Eluru Corporation Result: ఏపీలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఏలూరు ఫలితాలకు సంబంధించి  రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.

ఏపీలో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లతో పాటే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు(Eluru Corporation Elections) సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు ( Ap high court) విచారణ జరిపింది. ముందుగా సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ పిటీషనర్ ధర్మాసనం ముందు సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన ఛీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ( Justice Arup kumar goswamy) నేృతృత్వంలోని ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు అనుమతిచ్చి..ఫలితాల్ని వెల్లడించవద్దని ఆదేశాలిచ్చింది.

దాంతో ఇప్పుడు ఏలూరు ఫలితాల్ని వెలువరించేందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీనిపై హైకోర్టు( High court) లో వాదనలు ముగిశాయి. తప్పుల సవరణకు సింగిల్ జడ్జ్ గతంలో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశామని ప్రభుత్వం తరపున ఏజీ వాదన విన్పించారు. తమ పేర్లు ఓటర్ల జాబితాలో తప్పుగా ఉన్నాయని భావిస్తే సంబంధిత అధికారుల్ని ఆశ్రయించి తప్పుల్ని సవరించుకునే వెసులుబాటు ఉందని..కానీ పిటీషనర్లు మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయించారన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి ( Eluru Corporation Election Results) అనుమతి ఇవ్వాలని కోరారు. కేవలం ఓటర్ల జాబితాలో తప్పులున్నాయన్న కారణంతో ఎన్నికల్ని నిలిపివేయడం సరికాదని మరో పిటీషనర్ తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తూ ప్రకటించింది

Also read: Ap Exams: ఏపీలో స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు, టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More