Home> ఏపీ
Advertisement

Chandrababu Case Updates: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు మళ్లీ నిరాశ, విచారణ వాయిదా

Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు నిరాశ తప్పడం లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ మరోసారి వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Chandrababu Case Updates: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు మళ్లీ నిరాశ, విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఏపీ హైకోర్టు బెయిల్ పిటీషన్ విచారణను బుధవారం 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇంతకుముందు జరిగిన విచారణలో పీటీ వారెంట్ విషయంలో ఈనెల 16 అంటే ఇావాళ్టి వరకూ ముందుకు వెళ్లవద్దని ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టుని ఆదేశించింది. ఇవాళ అక్టోబర్ 18 వరకూ బెయిల్ పిటీషన్ విచారణను వాయిదా వేసింది,

ఇవాళ ఈ పిటీషన్‌పై మరోసారి విచారణ జరిగింది. అటు సీఐడీ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయడంతో వాదనలకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. అందుకే అక్టోబర్ 18 బుధవారానికి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 

అమరావతి కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా మార్చి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ కుట్ర పన్నారని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువ పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చినట్టుగా ప్రధాన ఆరోపణ. ఈ కేసులో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, నారా లోకేశ్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ వ్యాపారవేత్తలు లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also read: Ap cm ys jagan: విశాఖ షిఫ్టింగ్ ఆలస్యం, డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని స్పష్టం చేసిన జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More