Home> ఏపీ
Advertisement

AP: మందుబాబులకు శుభవార్త.. నేటి నుంచే ధరల తగ్గింపు

 liquor price in ap today | ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ నిత్యం ఎంతో మంది పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మద్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడంతో పాటు భారీ సంఖ్యలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు తెలంగాణ, కర్ణాటక వైపు చూస్తున్న విషయం తెలిసిందే.

AP: మందుబాబులకు శుభవార్త.. నేటి నుంచే ధరల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఏపీలో మద్యం ధరల్ని (AP Liquor Price) తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన మద్యం ధరలు నేటి నుంచి ఏపీలో అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడంతో పాటు భారీ సంఖ్యలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు తెలంగాణ, కర్ణాటక వైపు చూస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ నిత్యం ఎంతో మంది పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మద్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్)లో మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్ల ధరలు తగ్గించింది. కనీసం రూ.50 నుంచి రూ.1350 వరకు పలు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించినట్లు సమాచారం. 

 

రెడీ టు డ్రింక్ మద్యం ధరలు యథాతథంగా కొనసాగనున్నాయి. క్వార్టర్ బాటిల్ ధర రూ.200లోపు ఉండే వాటి ధరలలో ఏ మార్పు లేదని, అంతకు పైగా ఉండే వాటిలో ధరలు తగ్గించారు. ఎస్ఈబీ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినట్లు వెల్లడించింది. ఐఎంఎఫ్‌ఎల్‌ బ్రాండ్లలో అధికంగా ధరలు సవరించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అక్టోబర్ 30 నుంచి తగ్గించిన మద్యం ధరలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More