Home> ఏపీ
Advertisement

AP: రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం రేపే అన్నదాతల ఖాతాల్లోకి

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త విన్పించారు. ఓ వైపు రైతు భరోసా..మరోవైపు నివర్ తుపాను నష్ట పరిహారాన్ని రేపే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు జగన్.

AP: రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం రేపే అన్నదాతల ఖాతాల్లోకి

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ys Jagan ) శుభవార్త విన్పించారు. ఓ వైపు రైతు భరోసా..మరోవైపు నివర్ తుపాను నష్ట పరిహారాన్ని రేపే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు జగన్.

ఏపీ ( AP ) లో రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. ప్రభుత్వం తరపున ఇచ్చే రైతు భరోసా ( Rythy Bharosa ), నివర్ తుపాను నష్ట పరిహారాన్ని ( Nivar Cyclone compensation ) ప్రభుత్వం ముందే ఇవ్వడానికి నిర్ణయించింది. రేపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.  రైతు భరోసా మూడవ విడత 1120 కోట్ల చెల్లింపులతో 51.59 లక్షల రైతులకు లబ్ది చేకూరనుంది. 

మరోవైపు నివర్‌ తుపాను  ( Nivar cyclone ) కారణంగా  నష్టపోయిన 12.01 లక్షల ఎకరాలకు పరిహారాన్ని కూడా ప్రభుత్వం రేపే అందిస్తోంది. నష్టపోయిన రైతన్నలకు మొత్తం 646 కోట్ల నివర్ నష్ట పరిహారాన్నిప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంతవేగంగా తుపాను బాధితులకు  పరిహారం చెల్లించడం ఇదే తొలిసారి. 

Also read: AP: వైఎస్ జగన్ సర్కార్ చారిత్రక నిర్ణయం.. నెరవేరిన వారి దశాబ్దాల కల

Read More