Home> ఏపీ
Advertisement

E-Pass System: ఏపీలో అత్యవసర ప్రయాణాలకు మళ్లీ ఈపాస్ విధానం

E-Pass System: కరోనా మహమ్మారి కట్టడికి  విధించిన కర్ఫ్యూ మరింత కఠినం కానుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈపాస్ విధానం మరోసారి తెరపైకి రానుంది.

E-Pass System: ఏపీలో అత్యవసర ప్రయాణాలకు మళ్లీ ఈపాస్ విధానం

E-Pass System: కరోనా మహమ్మారి కట్టడికి  విధించిన కర్ఫ్యూ మరింత కఠినం కానుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈపాస్ విధానం మరోసారి తెరపైకి రానుంది.

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఆంధప్రదేశ్‌లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 21 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం ఏపీలో మే 5 నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది. మద్యాహ్నం 12 గంటల్నించి..మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కఠిన కర్ఫ్యూ విధించారు. రేపటి నుంచి కర్ఫ్యూ మరింత కఠినం కానుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(Gautam Sawang) స్పష్టం చేశారు. కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. విజయవాడ నగరంలో పర్యటించిన ఆయన కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ రెండేసి మాస్క్‌లు ధరించాలని..శానిటైజర్ వినియోగించాలని..జాగ్రత్తలు పాటించాలని కోరారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపట్నించి ఈ-పాస్ విధానం(E-Pass System) అందుబాటులో తీసుకొస్తున్నామని డీజీపీ తెలిపారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల్ని, ప్రచారాల్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కరోనా లక్షణాల్ని గుర్తించినవారు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104,108 సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం(Ap government) నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించి ప్రభుత్వం సూచించిన అధికారుల్నించి తప్పకుండా అనుమతి తీసుకోవల్సిన ఉంటుంది. 

Also read: Oxygen Committee: ఆక్సిజన్ పర్యవేక్షణ కోసం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More