Home> ఏపీ
Advertisement

AP Mega DSC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీతో మరోసారి టెట్ పరీక్ష

AP Mega DSC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూలై 1న మెగా డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AP Mega DSC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీతో మరోసారి టెట్ పరీక్ష

AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసిన చంద్రబాబు ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించారు. జూలై 1న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులకు మెగా డీఎస్సీతో పాటు మరో గుడ్‌న్యూస్ అందించింది. ఇవాళ విడుదలైన టెట్ పరీక్షల్లో అర్హత సాధించనివారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 6 వరకూ జరిగిన టెట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. టెట్‌లో ఒకసారి ఉత్తీర్ణత చెందితేనే డీఎస్సీకు అర్హత లభిస్తుంది. ఈ క్రమంలో టెట్‌లో ఉత్తీర్ణులు కానివారు మెగా డీఎస్సీలో అర్హత సాధించేందుకు వీలుగా మరోసారి టెట్ పరీక్ష నిర్వహించనుంది. 

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జూలై 1వ తేదీన విడుదల కానుంది. అంతకంటే ముందు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ కంటే ముందే టెట్ పరీక్ష ఉంటుంది. టెట్ పరీక్షకు డీఎస్కీ పరీక్షకు 30 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. జూలై 1న డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా వెలువడవచ్చు. గత ప్రభుత్వం ఇచ్చిన 6 వేల పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు కానుంది. మొత్తం 16,347 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ వెలువడనుంది. గత డీఎస్సీకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కొత్తగా మరోసారి అప్లై చేసుకోవల్సి ఉంటుంది. కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎన్నికల కోడ్ కారణంగా గత ప్రభుత్వం నిర్వహించదల్చిన డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. ఈలోగా ప్రభుత్వం మారడంతో అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత ప్రభుత్వం నిర్వహించదల్చిన డీఎస్సీకు 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరగడంతో పాటు మరోసారి టెట్ పరీక్ష నిర్వహిస్తుండటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Also read: IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More