Home> ఏపీ
Advertisement

AP Jobs: ఉద్యోగాల తొలగింపుపై ముఖ్యమంత్రి సీరియస్, అంతా అవాస్తవమంటున్న సజ్జల

AP Jobs: ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఆగిపోయింది. ఉద్యోగుల తొలగింపు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.
 

AP Jobs: ఉద్యోగాల తొలగింపుపై ముఖ్యమంత్రి సీరియస్, అంతా అవాస్తవమంటున్న సజ్జల

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అటు ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు.

ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై ఆయన మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఉద్యోగుల్ని తొలగించే ప్రసక్తే లేదని సజ్జల స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తుూ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలపై విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. 

గత మూడ్రోజులుగా ఈ వ్యవహారంపై వస్తున్న వార్తలతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సకాలంలో స్పందించారు. ఆ ఆధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడో కిందిస్థాయిలో కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని సజ్జల వివరణ ఇచ్చారు. పెద్దఎత్తున ఉద్యోగాల్ని కల్పిస్తున్న ప్రభుత్వం తమదని..హడావిడిగా ఉద్యోగాలు తీసివేయడమనేది తమ ప్రభుత్వంలో ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

గతంలో ఎన్నడూ లేనంతగా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామని..ప్రస్తుతం పోలీస్ రిక్రూట్‌మెంట్ సైతం జరుగుతోందని సజ్జల గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగావకాశాలు, ఉద్యోగ భద్రతపైనే దృష్టి పెడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

Also read: Byreddy Siddharth Reddy: బైరెడ్డి పవర్‌పుల్ స్పీచ్.. మధ్యలో అస్వస్థత.. కార్యకర్తల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More