Home> ఏపీ
Advertisement

Mansas Lands Issue: మాన్సాస్ భూముల వ్యవహారంలో ఆరు కమిటీలతో విచారణ

Mansas Lands Issue: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన మాన్సాస్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలో దిగి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆరు కమిటీల్ని ఏర్పాటు చేసింది.
 

Mansas Lands Issue: మాన్సాస్ భూముల వ్యవహారంలో ఆరు కమిటీలతో విచారణ

Mansas Lands Issue: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన మాన్సాస్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలో దిగి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆరు కమిటీల్ని ఏర్పాటు చేసింది.

విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు (Mansas Trust)వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజునే నియమించాలని..సంచయిత నియామకం చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పిచ్చింది. సంచయితను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు(Ap High Court) కొట్టివేసింది. ఇప్పుడీ ట్రస్టు భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై రాష్ట్ర దేవాదాయశాఖ విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా ఆరు కమిటీల్ని ఏర్పాటు చేసింది. మాన్సాస్ భూముల (Mansas lands issue) రికార్డులు మొత్తం డిజిటలైజేషన్, మాన్సాస్ భూముల సర్వే, భూముల రికార్డుల్లో వాస్తవాల పరిశీలన, మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలపై విచారణ, మాన్సాస్ కార్యాలయాల రికార్డుల తనిఖీలు, మాన్సాస్ విద్యాలయాల నిధుల వినియోగంపై వివిధ కమిటీలతో విచారణ జరగనుంది. నివేదిక సమర్పించేందుకు గడువుగా నెలరోజులివ్వాలని కమిటీ నిర్ణయించింది. మాన్సాస్(Mansas Trust)కు చెందిన 14 వేల ఎకరాల భూమితో పాటు సీతారామ వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన 6 వేల ఎకరాల భూముల బదలాయింపులపై కూడా కమిటీ విచారణ చేపట్టింది.

Also read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, తగ్గిన మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More