Home> ఏపీ
Advertisement

ఏపీలో కరోనా పంజా.. రికార్డు కేసులు

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు (AP Corona Positive Cases) భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 23,814కు చేరుకున్నాయి. 55 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు.

ఏపీలో కరోనా పంజా.. రికార్డు కేసులు

AP Corona Cases | గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1500 మందికి కరోనా సోకగా, మిగతా 55 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 23,814కు చేరుకున్నాయి. వికాస్ దుబే అరెస్ట్‌పై తల్లి సరళా దేవి ఏమన్నారంటే!

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల (AP COVID-19 Cases)కు గాను 12,154 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 11,383 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 13 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 277కి చేరింది.  అప్సరా రాణిగా పేరు మార్చి RGV థ్రిల్లర్ ఛాన్స్!

తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,555 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 902 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజులో 25 వేల కరోనా కేసులు!

నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,94,615 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 21,071 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,319 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 424 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 9న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

 

Read More