Home> ఏపీ
Advertisement

Amma Vodi: తల్లుల ఖాతాల్లోకి అమ్మ ఒడి డబ్బులు.. శ్రీకాకుళంలో బటన్ నొక్కనున్న సీఎం జగన్

Jagananna Amma Vodi: ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి మూడో విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. 6 వేల 595 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న కార్యక్రమంలో అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ సందర్భంగా బహిరంగసభ నిర్వహిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు.  గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖపట్నం వెళతారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో శ్రీకాకుళం వెళ్తారు జగన్. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి కారులో కోడి రామ్మూర్తి స్టేడియానికి వెళతారు. అక్కడే ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతారు సీఎం జగన్. అనంతరం బహిరంగసభలో మాట్లాడుతారు. ఆ తర్వాత వేదికపైనే బటన్ నొక్కి.. అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. సీఎం జగన్ బటన్ నొక్కిన వెంటనే విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి అమ్మ ఒడి డబ్బులు జమవుతాయి.

అమ్మఒడి  పథకం కింద  1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతోన్న విద్యార్థులకు ఏటా 15 వేల రూపాయలు ఇస్తారు. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు.  ఈ ఏడాది అమ్మఒడి పథకం కింద 6 వేల 594 కోట్ల రూపాయలను 43 లక్షల 96 వేల 402 మందికి అందించనున్నారు. అమ్మఒడి పథకం లబ్దిదారుల్లో  54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి లక్ష మంది లబ్దిదారులు తగ్గారు. దీంతో అమ్మఒడి పథకంలో కోత పెట్టారని విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం అర్హులైనవారందరికి ఇస్తున్నామని తెలిపింది. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిధిలోకి 5 లక్షల 48 వేల 329 మంది తల్లులు వచ్చారని తెలిపింది.

Read also: Hyderabad Thub 2: వావ్ వండర్.. టీహబ్ 2 అత్యద్భుతమంటూ ప్రముఖుల ట్వీట్లు!

Read also: Rajiv Swagruha Flats: రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్.. నేటి నుంచి లాటరీ పద్ధతిలో  కేటాయింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More