Home> ఏపీ
Advertisement

Ap Government: ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త వేదిక, జగనన్నకు చెబుదాం ఇవాళే ప్రారంభం

Ap Government: ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక కల్పిస్తోంది. సమస్యల పరిష్కారం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Ap Government: ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త వేదిక, జగనన్నకు చెబుదాం ఇవాళే ప్రారంభం

Ap Government: దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పధకాల్ని అందిస్తున్న ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో కొత్త కార్యక్రమం అంకురార్పణ చేసింది. ఆ కార్యక్రమం పేరు జగనన్నకు చెబుదాం. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

జగనన్నకు చెబుదాం @ 1902..ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక కల్పిస్తుంది. పూర్తిస్థాయిలో వినతులు లేదా సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అంటే నిర్ణీత లేదా నిర్దేశిత గడువులోగా ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా సంబంధిత సమస్య లేదా వినతిని పరిష్కరిస్తుంది. ప్రజలు తమ సమస్యల్ని, వినతుల్ని విన్నవించేందుకు ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటైంది. జగనన్నకు చెబుదాం పేరుతో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులున్నా చెప్పవచ్చు.

1902 నెంబర్‌కు వచ్చే ప్రతి సమస్య లేదా వినతి పరిష్కారమయ్యేవరకూ ట్రాకింగ్ చేస్తారు. సంక్షేమ పథకాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డుల సమస్య, ఆరోగ్య స్రీ సేవలు ఇలా ఏ సమస్యనైనా ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చు. రెవిన్యూ సమస్యలు, ప్రభుత్వ సేవలకు చెందిన వినతులేవైనా సరే 1902కు కాల్ చేసి చెప్పవచ్చు. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తమ సమస్యలు లేదా వినతుల స్థితి, పరిష్కారం గురించి ట్రాకింగ్ చేయవచ్చు. ఫిర్యాదులు పరిష్కారమయ్యే ప్రక్రియను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రజా ప్రతినిధులందర్నీ ఈ కార్యక్రమంలో భాగం చేయాలని ప్రభుత్వం సూచించింది. 

జగనన్నకు చెబుదాం ఎలా పనిచేస్తుంది

ముందుగా ప్రజలు తమ సమస్య లేదా వినతిని 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలి. కాల్ సెంటర్ ప్రతినిధి సమస్యను విని ఒక యువర్ రిక్వస్ట్ ఐడీ అందిస్తారు. ఈ ఐడీ ఆధారంగా మీ ఆర్జీ స్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అప్‌డేట్ అవుతుంటుంది. చివరిగా సమస్య పరిష్కారమయ్యాక మీ బాధ్యతగా ఏపీ ప్రభుత్వం సేవలపై అభిప్రాయం పంచుకోవచ్చు.

Also read: Cyclone Mocha Latest News: మోచ తుఫాన్.. ఏ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపనుందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More