Home> ఏపీ
Advertisement

AP: టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణం రేపు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సంకల్పించింది. 

AP: టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణం రేపు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సంకల్పించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో చిన్న చిన్న దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షాల రాజకీయాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల్ని పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సంకల్పించారు. తెలుగుదేశం ప్రభుత్వ ( Telugu Desam Government ) హయాంలో రాష్ట్రంలో కూల్చేసిన 9 ఆలయాల్ని నిర్మించడం ( Rebuilt of Temples ), 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా రేపు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల చెంత శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ కమీషనర్ బత్తిన శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేశ్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

సీఎం జగన్ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  ( Ap Minister Vellampalli Srinivas ) తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారని చెప్పారు. జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ మత విద్వేషాల్ని రెచ్చగొడుతుందన్నారు. అర్ధరాత్రులు ఆలయాలపై దాడులు చేస్తూ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. టీడీపీ హయాంలో పట్టపగలే ఆలయాలు కూల్చితే ప్రశ్నించని పవన్ కళ్యాణ్..ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. రాజకీయ రాబందులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. 

Also read: AP: ఇక 45 రోజులపాటు రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More