Home> ఏపీ
Advertisement

Ys Jagan Review on Education Sector: రాష్ట్రంలో ప్రతి స్కూల్‌కు సీబీఎస్ఈ గుర్తింపు తప్పనిసరి

Ys Jagan Review on Education Sector: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ విద్యాశాఖపై కీలకమైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యావిధానం ఒక్కటే ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ గుర్తింపు అన్ని స్కూళ్లకూ ఉండాలని సూచించారు. 
 

Ys Jagan Review on Education Sector: రాష్ట్రంలో ప్రతి స్కూల్‌కు సీబీఎస్ఈ గుర్తింపు తప్పనిసరి

Ys Jagan Review on Education Sector: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ విద్యాశాఖపై కీలకమైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యావిధానం ఒక్కటే ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ గుర్తింపు అన్ని స్కూళ్లకూ ఉండాలని సూచించారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం పలు సూచనలు చేశారు. కీలకమైన ఆదేశాలిచ్చారు. స్కూళ్ల నిర్వహణ, విద్యార్ధుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుక పథకాలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. 

కోవిడ్ అనంతరం పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్ధుల హాజరుపై వైఎస్ జగన్ ఆరా తీశారు. కరోనా నివారణ చర్యలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆగస్టు నెలలో విద్యార్ధుల హాజరు 73 శాతముంటే..సెప్టెంబర్ నెలలో 82 శాతానికి పెరిగిందని..అక్టోబర్ నెలలో 85 శాతం చేరుకుందని అధికారులు వివరించారు. అమ్మఒడి పథకం(Ammavodi Scheme)స్ఫూర్తి కొనసాగాలని వైఎస్ జగన్ సూచించారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మఒడి పథకం ప్రధాన ఉద్దేశ్యమని జగన్ చెప్పారు. నాడు నేడు పథకం(Naadu Nedu Scheme)ద్వారా రాష్ట్రంలో వేయి కోట్ల ఖర్చుతో 15వేలకుపైగా స్కూళ్లను తీర్దిదిద్దామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు తీసుకొచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ బోర్డు(CBSE Board) పరీక్షలు రాసేవిధంగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్ విధింగా ప్లే గ్రౌండ్ కలిగి ఉండాలని..లేనిచోట భూసేకరణతో ప్లే గ్రౌండ్ అందుబాటులో తీసుకురావాలని సూచించారు. 

Also read: Airport Extension: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు భారీగా పెట్టుబడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More