Home> ఏపీ
Advertisement

25 districts in AP : త్వరలోనే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు!!

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్రంలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఓవైపు చర్చలు జరుగుతుండగానే తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు.

25 districts in AP : త్వరలోనే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు!!

విశాఖ: ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్రంలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఓవైపు చర్చలు జరుగుతుండగానే తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఉన్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు. విశాఖపట్నంలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని అన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచనతోనూ సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నట్టు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
 
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై మంత్రి అవంతి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని అన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్ కేవలం 5 నెలల్లోనే చేసి చూపించారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.

Read More