Home> ఏపీ
Advertisement

AP CM YS Jagan: ఏలూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy To Visit Eluru : వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. 

AP CM YS Jagan: ఏలూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan Eluru Tour : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి... 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక అధికారులతో ఏపీ సీఎం సమావేశం కానున్నారు.

కాగా, ప.గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో వందల మంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం, ఆదివారం పలు ఆస్పత్రులలో చేరారు. దీనిపై ఆదివారం ఉదయం ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్లనానితో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈ వింత వ్యాధి ఏంటన్నది కూడా వైద్యులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. 

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్

మొదటగా ఏలూరు వన్‌టౌన్‌లోని దక్షిణ వీధిలో కొంతమంది ఇలాంటి లక్షణాలతో శనివారం ఆసుపత్రిలో చేరారు. ఆపై ఆదివారం సైతం మరికొందరు ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి (Eluru Government Hospital)లో చేరిన బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఆళ్లనాని (alla nani) పరామర్శించారు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 
Read More