Home> ఏపీ
Advertisement

Disha Vehicles: మహిళల భద్రతపై మరో మెట్టు, దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభం

Disha Vehicles: ఏపీలో మహిళల భద్రతకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగేశారు. దిశ చట్టంలో భాగంగా ఇప్పుడు దిశ వాహనాలు ప్రారంభించారు. త్వరలో 3 వేల ఎమర్జెన్సీ వాహనాలు ప్రారంభించనున్నామని వైఎస్ జగన్ తెలిపారు.

Disha Vehicles: మహిళల భద్రతపై మరో మెట్టు, దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభం

Disha Vehicles: ఏపీలో మహిళల భద్రతకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగేశారు. దిశ చట్టంలో భాగంగా ఇప్పుడు దిశ వాహనాలు ప్రారంభించారు. త్వరలో 3 వేల ఎమర్జెన్సీ వాహనాలు ప్రారంభించనున్నామని వైఎస్ జగన్ తెలిపారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టం అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. మహిళల సంరక్షణకై రాష్ట్రంలో 163 దిశ పెట్రోలింగ్ వాహనాల్ని ప్రారంభించింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 వందల ద్విచక్ర వాహనాలున్నాయని..మరో 3 వేల ఎమర్జెన్సీ వాహనాల్ని ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్లమంది అక్కచెల్లెళ్లు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. 

ఎలా పనిచేస్తాయి..

దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పట్టణాల్లో అయితే 4-5 నిమిషాల్లో..గ్రామాల్లో అయితే పది నిమిషాల్లో స్పందిస్తారు. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులుంటాయి. దిశ పెట్రోలింగ్ వాహనాల కోసం 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్ నిమిత్తం 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులు చిక్కుకున్నప్పుడు రక్షణ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం దిశ పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 

Also read: Clean Godavari Project: గోదావరి ప్రక్షాళనకు నమామి గోదావరి, ఇక క్లీన్ గోదావరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More