Home> ఏపీ
Advertisement

CM Jagan Tour: ఏపీలో రేపటి నుంచి బడిగంట..విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్..!

CM Jagan Tour: ఏపీలో రేపటి(మంగళవారం) నుంచి స్కూళ్లు పునర్‌ ప్రారంభం కానున్నాయి. ఈతరుణంలో జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.

CM Jagan Tour: ఏపీలో రేపటి నుంచి బడిగంట..విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్..!

CM Jagan Tour: ఏపీ సీఎం జగన్..రేపుమంగళవారం) కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. స్థానిక మున్సిపల్ మైదానంలో మూడో ఏడాది జగననన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా  ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 40 వేల 421 మంది విద్యార్థులకు కిట్లను అందజేస్తారు. ఇందుకు రూ.931.02 కోట్లను ఖర్చు చేస్తున్నారు. 

ప్రతి విద్యార్థికి దాదాపు రూ.2 వేల విలువైన జగనన్న విద్యా కానుక కిట్ల అందిస్తున్నారు. 20220-21 విద్యా సంవత్సంలో 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. మొత్తం రూ.648.10 కోట్లను ఖర్చు చేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో 45 లక్షల 71 వేల 051 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇందుకు రూ.789.21 కోట్లు ఖర్చు చేశారు. ఈవిద్యా సంవత్సరంలో 47 లక్షల 40 వేల 421 లక్షల మంది విద్యార్థులకే మేలు చేకూరనుంది. 

మరోవైపు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 37.21 లక్షల విద్యార్థులు చదివేవారు. 2021-22 నాటికి 44.30 లక్షలకు పెరిగింది. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారి సంఖ్య 72.47 లక్షలకు చేరింది. 

Also read:Minister Harish Rao: తెలంగాణపై మరోసారి విషం కక్కారు..మోదీ, షాపై హరీష్‌రావు ధ్వజం..!

Also read:God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్‌ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More