Home> ఏపీ
Advertisement

జనాలు తుపాను కష్టాల్లో ఉంటే .. జగన్ కు సినిమాలు కావాలా ? - చంద్రబాబు సెటైర్లు

ఎండ్ గేమ్ చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ మేరకు స్పందించారు

జనాలు తుపాను కష్టాల్లో ఉంటే .. జగన్ కు సినిమాలు కావాలా ? - చంద్రబాబు సెటైర్లు

వైసీపీ అధినేత జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు విరుచుకుపడ్డారు. తుపాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక వైపు రాష్ట్రంలో తుపానుతో జనాలు కష్టాల్లో ఉంటే ..ఈ సమయంలో జగన్ కు సినిమాలు కావాలా ? అంటూ సైటైర్ వేశారు. జగన్ కూడా తుపానుకు సంబంధించి అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని హాయిగా సినిమాకు వెళ్లారేమో అంటూ చంద్రబాబు వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.

పార్టీ అధినేత తీరు ఇలా ఉంటే మరోవైపు తుపాను ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా వైసీపీ నేతలు విదేశాలకు వెళుతున్నారని విమర్శించారు. ఆదివారం రాత్రి వైఎస్  జగన్ హైదరాబాద్ లోని ప్రిన్స్ థియేటర్ లో అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ మేరకు స్పందించారు

Read More