Home> ఏపీ
Advertisement

AP Cabinet: నూతన పథకాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్..మంత్రి వర్గ నిర్ణయాలు ఇవే..!

AP Cabinet: సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు రెండున్నర గంటల మంతనాల తర్వాత కీలక పథకాలకు పచ్చజెండా ఊపారు. 

AP Cabinet: నూతన పథకాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్..మంత్రి వర్గ నిర్ణయాలు ఇవే..!

AP Cabinet: సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు రెండున్నర గంటల మంతనాల తర్వాత కీలక పథకాలకు పచ్చజెండా ఊపారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు పచ్చజెండా ఊపారు. వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు మంత్రివర్గం రైట్‌రైట్ చెప్పింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం అందించనున్నారు. దీనిపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో రూ.15 వేల కోట్లతో ఏర్పాటుకానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఆమోదముద్ర వేశారు. వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3 వేల 530 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. దేవాలయాల కౌలు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీ,సంక్షేమ క్యాలెండర్‌కు పచ్చజెండా ఊపారు. ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్న వారికి సైతం వర్తించనుంది. పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్ కొనసాగింపునకు ఆమోదం తెలిపారు.

Also read:Agniveer Recruitment 2022 Air Force: అగ్నివీర్‌గా మారాలనుకుంటున్నారా..వాయుసేన నుంచి రిజిస్ట్రేషన్‌ షురూ..!

Also read:Pawan Kalyan With Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్ కి మరో ఫీస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More