Home> ఏపీ
Advertisement

Pawan Kalyan: పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..

Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.

Pawan Kalyan: పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..

Pawan Kalyan - Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాల్లో కాకలు తీరిన నేత. అంతేకాదు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత సీనియర్ శాసన సభ్యుడు. మొత్తంగా 10 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే.. అందులో 9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు 1989 నుంచి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సార్లు ఎన్నికై రికార్డు క్రియేట్ చేసారు. ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేతగా పేరు గడించారు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు సార్లు అందులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. విభిజిత ఏపీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా.. మొత్తంగా 4 సార్లు సీఎం అయిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతోంది. అంతేకాదు ఏపీలో సుధీర్ఘ కాలం ప్రతిపక్షనేతగా ఉన్న నేతగా రికార్డు క్రియేట్ చేసారు. ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు పలు సినిమాల్లో ఆయన సీఎంగా ఉన్న సన్నివేశాలను వాడుకున్నారు.

అంతేనా..ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాలో ఓ సిన్నవేశంలో ముఖ్యమంత్రిగా కాసేపు చంద్రబాబు ఆ సినిమాలో కనిపించడం విశేషం. రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాలో చంద్రబాబు సీఎంగా కనిపించడం విశేషం. అప్పటి నుంచి చంద్రబాబు విజన్ పై పవన్ కళ్యాణ్ కు మంచి నమ్మకముంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినపుడు 2014లో బీజేపీ, టీడీపిక కూటమికి మద్దతు ఇచ్చారు. 2019లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసారు. ఇక 2024లో మాత్రం కేంద్రంలో భారతీయ జనతపార్టీ, ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీతో పొత్తు పొట్టుకొని 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసారు. అంతేకాదు పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డులకు ఎక్కింది.

ఏపీలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అంతేకాదు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. త్వరలో నెలలో పది రోజులు చొప్పున ఆయా సినిమాలకు డేట్స్ కేటాయించే పనిలో పడ్డారు పనవ్ కళ్యాణ్. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మంత్రిగా బాధ్యతలు నిర్వహించేందకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More