Home> ఏపీ
Advertisement

కృష్ణా జిల్లాకు మరో గండం.. భారీ వర్షాలతో నగరం అతలాకుతలం

కృష్ణా జిల్లా మొత్తం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు అన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి.

కృష్ణా జిల్లాకు మరో గండం.. భారీ వర్షాలతో నగరం అతలాకుతలం

కృష్ణా జిల్లా మొత్తం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు అన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. అలాగే లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.ఏపిఐఐసీ కాలనీ, ఆటోనగర్, వన్ టౌన్ ప్రాంతాలన్నీ కూడా పూర్తి నీటిమయమయ్యాయి. ఈ భారీ వర్షాల వల్ల నూజివీడు, మొగులూరు, మున్నలూరు, అమరావరం, వీర్లపాడు, దొడ్డేదేవరాపాడు, పల్లెంపల్లి, దామలూరు మొదలైన ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిల్చిపోయాయి. కాజ్ వేపై భారీగా వరద నీరు ప్రవహించడంతో నందిగామ, వీర్లపాడు మండలాలు కూడా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.

కట్లేరు, వైరా, మున్నేరు వాగులు ధాటిగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో పాటు, అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో కూడా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని.. అందుచేత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. 

కేరళ రాష్ట్రం వరదల వల్ల అనుకోని విపత్తులో చిక్కుకుందని.. ఏ రాష్ట్రానికైనా ఇలాంటి విపత్తులు తప్పవని.. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటే ఎక్కువ శాతం నష్టం జరగకుండా చూడవచ్చని.. అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా అధికారులతో కూడా సీఎం మాట్లాడారు. ఆహారం, మందులు కొరత లేకుండా చూడాలని.. ఎలాంటి అనుమానం ఉన్నా ముందస్తుగానే సహాయ శిబిరాలు ఏర్పాటు చేసుకొని.. జనాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని తెలిపారు. 

Read More