Home> ఏపీ
Advertisement

AP govt: కరోనా టెస్టుల్లో జాప్యం వద్దు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (coronavirus) పరీక్షల నమూనాల సేకరణ కోసం అన్ని జిల్లాల్లో కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం (Andhrapradesh govt) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పరీక్షల ఫలితాల్లో జాప్యం జరుగుతుందన్న విషయాలపై ఏపీ ప్రభుత్వం స్పందించి ఉత్తర్వులిచ్చింది. 

AP govt: కరోనా టెస్టుల్లో జాప్యం వద్దు

corona tests: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( coronavirus ) పరీక్షల నమూనాల సేకరణ కోసం అన్ని జిల్లాల్లో కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం (Andhrapradesh govt) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పరీక్షల ఫలితాల్లో జాప్యం జరుగుతుందన్న విషయాలపై ఏపీ ప్రభుత్వం స్పందించి ఉత్తర్వులిచ్చింది. నియమనిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. Also read: ఏపీలో కరోనా పంజా.. ఒకేరోజు 43 మంది మృతి

వీఆర్డీఎల్, ట్రూనాట్ ల్యాబ్‌లల్లో నమూనాల సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేసి, అవి మూడు షిఫ్టులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణమే ఫలితాలను వెల్లడించాలని సూచించింది. ఐసీఎంఆర్ పోర్టల్‌లో నమోదు చేసే ఫలితాలు ఆరు గంటలకన్నా ఎక్కువ సమయం తీసుకోవొద్దని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.  కరోనా రోగికి మరలా పాజిటివ్ వస్తే దానిని కొత్త కేసుగా పరిగణించొద్దని ప్రకటించింది. Also read: ఏపీ, కర్ణాటకల మధ్య బస్సు సర్వీసుల నిలిపివేత

Read More