Home> ఏపీ
Advertisement

AP SSC Results 2023: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ వివరాలు ఇవీ

AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఎస్‌సి పరీక్షా ఫలితాల్ని విడుదల చేసారు . ఈ ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలి, డైరెక్ట్ లింక్స్ వివరాలు మీ కోసం..

AP SSC Results 2023: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ వివరాలు ఇవీ

AP SSC Results 2023: ఏపీ పదో తరగతి విద్యార్దులకు గుడ్‌న్యూస్. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాల తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్ని విడుదల చేస్తోంది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ జరిగిన పదో తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 19 నుంచి 26 వరకూ కొనసాగింది. ఆ తరువాత టేబులేషన్, డీ కోడింగ్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 30-35 వేలమంది ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత పగడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ జరిగింది. లీకేజ్ లేకుండా జాగ్రత్త పడ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం వరుసగా హిందీ, తెలుగు పేపర్లు లీకైన పరిస్థితి ఉంది. మరోవైపు పరీక్షలు ముగిసిన కేవలం 18 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం ఓ రికార్డు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను కూడా 20-25 రోజుల వ్యవధిలో విడుదల చేశారు.

పదో తరగతి పరీక్ష ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ వివరాలు ఇవీ

ముందుగా ప్రభుత్వ  అధికారిక వెబ్‌సైట్  https://bse.ap.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజిలో కన్పించే AP SSC ఫలితాల లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే..మీ ఫలితాలు ప్రత్యక్షమౌతాయి.

ఏపీలో మొత్తం 6 లక్షల 3 వేల 700 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఎవరైనా విద్యార్ధి నిర్ణీత ప్రశ్నల సంఖ్య కంటే ఎక్కువ సమాధానాలు రాస్తే..ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినవాటినే పరిగణలో తీసుకుంటారు. దీనికి సంబంధించి వాల్యుయేషన్‌కు ముందే పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

Also read: YSR Kalyanamasthu: లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ.. రూ.87.32 కోట్ల ఆర్థిక సహాయం: సీఎం జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More