Home> ఏపీ
Advertisement

AP Corona cases: ఏపీలో 5 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు!

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు మరింత పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొవిడ్​ కారణంగా ఒకరు (Corona death in AP) ప్రాణాలు కోల్పోయారు.

AP Corona cases: ఏపీలో 5 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు!

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,955 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 35,673 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల భారీగా తగ్గాయి. అయినప్పటికీ కేసులు మాత్రం భారీగా పెరగటం గమనార్హం.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,509 మంది కొవిడ్​కు బలయ్యారు.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 397 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,64,331 మంది కరోనాను జయించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,870 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

చిత్తురులో అత్యధికంగా 4,991 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత విశాఖపట్నంలో 4,691 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇక పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూల్​, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికిపైనే యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,18,32,010 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,101,710 శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.

Also read: Nandamuri Balakrishna: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్

Also read: Ys jagan Sankranthi Celebrations: అచ్చ తెలుగు పంచెకట్టుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి సంబరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More