Home> ఏపీ
Advertisement

AP Corona cases: ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు, ఐదు మరణాలు

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మహమ్మారికి ఐదు మంది (Corona death in AP) బలయ్యారు.

AP Corona cases: ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు, ఐదు మరణాలు

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 12,615 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 47,420 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,527 మంది కొవిడ్​కు బలయ్యారు.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,674 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,71,658 మంది కరోనాను జయించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 53,871 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

విశాఖపట్నంలో అత్యధికంగా 11,088 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత చిత్తూరులో 9,888 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో రెండు వేలకుపైనే యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,20,12,102 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,140,056 శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.

Also read: Wife beheads Husband: భర్త తలతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భార్య.. షాక్ తిన్న పోలీసులు..

Also read: ap teachers union protest : ఏపీ అంతటా కలెటక్టరేట్ల ముట్టడి.. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More