Home> ఏపీ
Advertisement

AP Corona cases: రాష్ట్రంలో 24 గంటలల్లో 104 కరోనా కేసులు

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. రికవరీలు మాత్రం భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 104 మందికి పాజిటివ్​గా తేలింది.

AP Corona cases: రాష్ట్రంలో 24 గంటలల్లో 104 కరోనా కేసులు

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉన్నాయి. కొత్తగా 104 మందికి కొవిడ్​ పాజిటివ్​ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 28,209 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 133 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.

ఇక ఇప్పటి వరకు మొత్తం 3,11,56,578 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,76,410 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. మొత్తం 20,60,672 మంది కరోనాను జయించగా.. 14,489 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,249 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి. చిత్తూరులో అత్యధికంగా 259 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం.

మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.

Also read: Sankranti special buses: సంక్రాతికి భారీగా స్పెషల్ బస్సులు- ఛార్జీలు బాదుడు కూడా..!

Also read: Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు.. మొత్తంగా ఏపీలో 3 కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More