Home> ఏపీ
Advertisement

AP Politics: గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటు ప్రశ్నార్ధకమే

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకుందాం.

AP Politics: గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటు ప్రశ్నార్ధకమే

AP Politics: కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు కోరుకుంటోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో దాదాపుగా నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయమే పైనల్ అయితే జనసేనలో అసమ్మతి రేగడం ఖాయంగా కన్పిస్తోంది. 

జనసేనకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టుంది. ఎందుకంటే ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 సీట్లలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు, జనసేన 1 స్థానం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14 గెల్చుకున్నాయి. ఈసారి పొత్తులో భాగంగా తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు కోరుకుంటోంది. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు దాదాపుగా నిర్ణయించుకుంది. తుని నుంచి యనమల కుమార్తె దివ్య, ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, పెద్దాపురం నుంచి చినరాజప్ప, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం.

జనసేనకు కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు సీట్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది. జనసేన మాత్రం ఈ మూడింటితో పాటు పిఠాపురం కూడా కోరుతోంది. మరి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా రాజమండ్రి రూరల్ నుంచి పోటీకు సిద్ధమైన కందుల దుర్గేష్ పరిస్థితి ఏంటనేది సందేహంగా మారింది. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తన అభ్యర్ధిగా బుచ్చయ్య చౌదరి పేరును దాదాపుగా ఖరారు చేసిన నేపధ్యంలో కందుల దుర్గేష్ వర్గం ఏం చేస్తుందనేది ప్రశ్నార్ధకమే. 

ఇక పిఠాపురంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ స్థానాన్ని ఆశిస్తున్న జనసేనకు నిరాశ ఎదురుకావచ్చు. అదే విధంగా మండపేట, కొత్తపేట సీటు విషయంలో కూడా జనసేనకు భంగపాటు తప్పదు. ఒకవేళ జనసేనకు టీడీపీ తూర్పు గోదావరి జిల్లాలో మరో రెండు సీట్లు అంటే మొత్తం 5 సీట్లు కేటాయించినా రాజమండ్రి రూరల్ మాత్రం కచ్చితంగా టీడీపీనే పోటీ చేసే పరిస్థితి కన్పిస్తోంది. అదే జరిగితే రాజమండ్రి రూరల్ నుంచి కాపు సామాజికవర్గంలో అసంతృప్తి ఉండవచ్చు. 

ఇక రాజమండ్రి సిటీ స్థానం దాదాపుగా ఆదిరెడ్డి కుటుంబానికి ఖరారైంది. ఆదిరెడ్డి భవానీ లేదా ఆమె భర్త వాసు పోటీ చేయనున్నారు. రామచంద్రపురం, అమలాపురం, పి గన్నవరం, రంపచోడవరం , కాకినాడ సిటీ స్థానాల్లో ఎవరనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 

Also read: AP Politics: వేమిరెడ్డి టీడీపీలో చేరనున్నారా, మరి వైసీపీ ప్లాన్ బి ఏమిటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More