Home> ఏపీ
Advertisement

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP Inter Marks Memo: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా వెల్లడయ్యాయి. తాజాగా మార్కుల షార్ట్ మెమోలు విడుదల చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. మార్కుల మెమోను https://bieap.apcfss.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా మార్కుల మెమోలను కూడా అందుబాటులో ఉంచింది. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 1 నుంచి మార్చ్ 14 వరకూ జరిగాయి. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 4 వరకూ వాల్యుయేషన్ పూర్తయింది. తాజాగా ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు సైతం విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలు, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ తేదీలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీలోగా సప్లిమెంటరీ పరీక్షలకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా విద్యార్ధుల షార్ట్ మెమోలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష షార్ట్ మెమోల కోసం ముందుగా https://bieap.apcfss.in ఓపెన్ చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజ్‌లో మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, ఒకేషనల్ కోర్సుల ఆప్షన్లు కన్పిస్తాయి. ఆ పక్కనున్న వ్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత సంబంధిత విద్యార్ధి రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. చివరిగా డౌన్‌లోడ్ మార్క్స్ మెమో ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు..మీ మార్కుల షార్ట్ మెమో కన్పిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.

Also read: AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More