Home> ఏపీ
Advertisement

Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహా

Revanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహా

 Revanth Reddy And Former CM KCR Wishes: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి తెలంగాణలోని రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు తన గురువుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి కాబోతుండడంతో రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌కు కూడా శుభాకాంక్షలు ప్రకటించారు.

Also Read: Hyderabad Lok Sabha: హైదరాబాద్‌లో మాధవీలతకు ఘోర పరాజయం.. అసదుద్దీన్‌ భారీ విజయం

'ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదాం' అని రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Also Read: Chiranjeevi Emotional: 'తమ్ముడు నువ్వు గేమ్‌ చేంజర్‌వి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌వి' పవన్‌పై చిరంజీవి ప్రశంసలు

ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కూడా ఏపీ ఎన్నికలపై స్పందించారు. గెలిచిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు, శుభాకాంక్షలు' అని కేసీఆ్‌ తెలిపారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు డీఎంకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇతర జాతీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Read More