Home> ఏపీ
Advertisement

CM Jagan Review: ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించాలి..గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ రివ్యూ..!

CM Jagan Review: గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

CM Jagan Review: ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించాలి..గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ రివ్యూ..!

CM Jagan Review: గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చేసిన పనులకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విశాఖలో ఇచ్చిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామని ఈసందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. అక్టోబర్ చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని సీఎంకు తెలిపారు. వీటి నిర్మాణం వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు, కాలనీల్లో సమానంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు సీఎం జగన్.

డ్రైనేజీ, నీళ్లు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాల కల్పన వెంటనే జరిగిపోవాలన్నారు. కాలనీల్లో పనులు వెంటనే తెలిసేలా అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా చూడాలని చెప్పారు. ఇందు కోసం ఓ నెంబర్ కేటాయించాలన్నారు. అనంతరం టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. 15 నుంచి 20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సిద్ధమవుతున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు.

పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. 90 రోజుల్లో ఇంటి పట్టా కార్యక్రమం సీఎం ఆరా తీశారు.వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2 లక్షల 3 వేల 920 మందిని కొత్త లిస్ట్‌లో చేర్చామని సీఎంకు అధికారులు వివరించారు. 

వీరిలో లక్ష మందికి ఇప్పటికే పట్టాలు ఇచ్చామన్నారు అధికారులు. మిగతా వారకి త్వరలో అందిస్తామని సీఎంకు తెలిపారు. పట్టా ఇవ్వడమే కాదు..లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దొరబాబుతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also read:Nethanna Bima: చేనేతకు పెద్దపీట వేస్తున్నాం..7న అద్భుత పథకం తీసుకొస్తున్నామన్న కేటీఆర్..!

Also read:Husband Harassment: హైదరాబాద్‌లో అమ్మాయి కాపురం మూవీ ఘటన.. ఆ వివరాలు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More