Home> ఏపీ
Advertisement

CM Jagan Review: అంతా వైద్య కళాశాలల నుంచే..వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణాలు..!

CM Jagan Review: వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan Review: అంతా వైద్య కళాశాలల నుంచే..వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణాలు..!

CM Jagan Review: ఆరోగ్యశ్రీ చికిత్సా విధానాలను గణనీయంగా పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి 745 ప్రొసిజర్లు రానున్నాయి. మొత్తంగా 3 వేల 148 చికిత్స విధానాలను ప్రజలకు అందనున్నాయి. సెప్టెంబర్ 5 నాటికి కొత్త చికిత్సా విధానాలు అమలులోకి రానున్నాయి. ఈమేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖలో కీలక సంస్కరణాలు చేపట్టాలన్నారు.

జిల్లాలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలన్నీ అదే జిల్లాకు చెందిన వైద్య కళాశాల ఆధ్వర్యంలో జరగాలని తెలిపారు. డీఎంఅండ్ హెచ్‌వో కార్యకలాపాలు కూడా జిల్లా మెడికల్ కాలేజీలోనే ఉండాలని ఆదేశించారు. డీఎంఅండ్ హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లను జిల్లా మెడికల్ కాలేజీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో ఉండే అన్ని రకాల ఆస్పత్రులు, క్లినిక్‌లకు సంబంధించిన కార్యకలాపాలు, పరిపాలన అన్ని మెడికల్ కాలేజీ నేతృత్వంలోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం. 

ఎవరు ఏం చేయాలి..ఎవరి విధులు ఏంటి..ఎవరి బాధ్యతలు ఏంటి..అన్న దానిపై ఎస్‌ఓపీ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నారు సీఎం వైఎస్ జగన్. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూస్టర్ డోస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. 

వైఎస్ఆర్‌ హెల్త్ క్లినిక్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఓ ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉండాలన్నారు. మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. విలేజ్ క్లినిక్స్‌లో 67 రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు. 14 రకాల పరీక్షలు కూడా చేయాలని చెప్పారు. 6 వేల 956 టెలీమెడిసిన్ స్పోక్స్, 27 హబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. 

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సమర్థవంతంగా అమలు చేయాలన్నారు సీఎం జగన్. విలేజ్ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నామని ఈసందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. సమీక్షా సమావేశంలో మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌ శర్మ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జెనివాస్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also read:CM Kcr: దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయి..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!

Also read:CPEC: భారత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..చైనా సైనికుల మోహరింపు దేనికీ..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More