Home> ఏపీ
Advertisement

ఏపీ ఆలయాలలో 'న్యూ ఇయర్' బంద్

పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం, జనవరి 1 నూతన సంవత్సరం రోజున భక్తులచే సమర్పించబడిన కానుకలను దేవాలయాలు ఇందుకు ఖర్చుచేయడం సముచితం కాదని పేర్కొన్నారు.

ఏపీ ఆలయాలలో 'న్యూ ఇయర్' బంద్

ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ విభాగం యొక్క హిందూ మతం ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జనవరి 1న న్యూ ఇయర్ వేడుక, స్వాగత బ్యానర్లు, మరియు పూల అలంకరణలు నుండి దూరంగా ఉండటానికి ఆలయ అధికారులను సూచిస్తూ నోటీసు జారీ చేసింది.

"ఉగాదిలో దేవాలయాలు ఉత్సవాలను నిర్వహించాలని హిందూ సాంప్రదాయం చెబుతుంది. ఉగాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలగువారికి నూతన సంవత్సరం. పాశ్చాత్య నూతన సంవత్సరం రోజున దేవాలయాలు అలంకరించకూడదు, మిఠాయిలు పంపిణీ చేయకూడదు" అని నోటిఫికేషన్ తెలిపింది.

పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం, జనవరి 1 నూతన సంవత్సరం రోజున భక్తులచే సమర్పించబడిన కానుకలను దేవాలయాలు ఇందుకు ఖర్చుచేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఇకపై జనవరి  1 తేదీన ఆలయాలలో పండుగ వాతావరణాన్ని సృష్టించడం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం సరికాదని సూచించారు.

Read More