Home> ఏపీ
Advertisement

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 2018–19 బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.30కు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడుతుంది. ఇవి 14వ అసెంబ్లీ 11వ సమావేశాలు కాగా, శాసనమండలికి 13వ సమావేశాలు. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ హాజరుకావడం లేదు. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకున్నట్లయితే వైసీపీ సమావేశాలకు హాజరుకావచ్చని సమాచారం.

కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న క్రమంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కీలక ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Read More